ఇటీవలే అర్జున పురస్కారాలకు ఎంపికైన భారత మహిళల బ్యాడ్మింటన్ జోడీ పుల్లెల గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది. శనివారం మహిళల డబుల్స్ సెమీఫైనల్స్‌లో గాయత్రి జోడీ 21- 18, 13-21, 8-21తో లియు షెంగ్ట, టాన్ నింగ్ (చైనా) చేతిలో పరాజయం చవిచూసింది. నిర్ణయాత్మక మూడో గేమ్ లో హవా అంతా చైనా జోడీదే. భారత ద్వయం కనీస పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో ట్రీసా, గాయత్రి కాంస్య పతకంతో సరిపెట్టుకున్నారు.