కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని ఎంపీపీ గర్ల్స్ ప్రైమరీ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా సేవలందిస్తున్న భవాని అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. కేంద్ర విద్యాశాఖ ప్రకటించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఆమె ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా విద్యాశాఖ ఎంపిక చేసిన 48 మంది ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాలో తెలంగాణ రాష్ట్రం నుంచి స్థానం సంపాదించిన ఏకైక ఉపాధ్యాయురాలు భవాని కావడం విశేషం. విద్యార్థులు స్వయంగా నేర్చుకునేలా ‘యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్’కు (ఆట పాటలతో కూడిన విద్య) భవాని అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.