ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిల్లీలో పోలీస్ స్టేషన్ లో ధర్నా చేపట్టిన నేపథ్యంలో కేటీఆర్ ఆయన వైఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యార్థుల హక్కుల కోసం పెద్ద ఎత్తున మాట్లాడే రాహుల్ గాంధీ, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యార్థులపై జరుగుతున్న పోలీసు దౌర్జన్యాలను ఎందుకు పట్టించుకోవడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. ఇక్కడ విద్యార్థులపై లాఠీఛార్జ్‌లు, అరెస్టులు జరుగుతున్నా నోరు మెదపకపోవడం వెనుక ఉన్న కారణాన్ని నిలదీశారు. తెలంగాణ విద్యార్థులపై పోలీసు బలగాలు ఉపయోగించినా స్పందించరా అని సెటైరికల్ ప్రశ్నలు వేశారు.