కొండా సురేఖ పై చర్యలకు రంగం సిద్దం అవుతోంది. తాజా వివాదం వేళ ఇక ఉపేక్షించకూడదని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ కు స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీలో కొండా సురేఖ తో పాటుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న నేతల పైనా చర్యలకు సిద్దం అవుతోంది. ఈ నేపథ్యంలో ఆమెను మంత్రివర్గం నుంచి తప్పించే ఆలోచనలో అధిష్ఠానం ఉందని, సీఎంపై, కాంగ్రెస్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడే నాయకులకు గట్టి సంకేతం ఇవ్వాలనుకుంటోందని ఢిల్లీ నేతల సమాచారం.