మాజీ MP మధుయాష్కీ పై కాంగ్రెస్ మహిళా నాయకురాలు కొత్త విద్య తీవ్ర ఆరోపణలు చేశారు. ఎల్బీనగర్‌లో మూడు, నాలుగు స్పా సెంటర్లు నిర్వహిస్తూ, వ్యభిచారం చేయిస్తూ అరెస్టయిన కేతవత్ రమేష్ నాయక్‌కు మధుయాష్కీ సాహెబ్ నగర్ డివిజన్ అధ్యక్ష పదవి ఇచ్చాడని పేర్కొన్నారు. స్పా సెంటర్ల నిర్వహణ వెనక మధుయాష్కీ అనుచరుల హస్తం ఉన్నట్లు, అసలు ఎల్బీనగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఎటుపోతుందని, ఈ వ్యవహారంపై మీనాక్షి , మహేష్ కుమార్ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని లేఖను రాశారు.