తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యల కారణంగా శుక్రవారం ఆమె చనిపోయారు. షావుకారు జానకి ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు ఆమెను చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 94 ఏళ్ల వయసులో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆమె తుది శ్వాస విడిచారు.