ఇంగ్లండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్ సరికొత్త రికార్డుతో టెస్ట్ క్రికెట్ చరిత్ర పుటల్లోకి ఎక్కారు. లీడ్స్‌లోని హెడింగ్లే మైదానంలో పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆయన అద్భుత ఘనత సాధించారు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) చరిత్రలో కెప్టెన్‌గా 3,000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా రూట్ సరికొత్త చరిత్ర లిఖించారు. కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రూట్ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు. ఆయన తర్వాత బెన్ స్టోక్స్ (2,182 రన్స్),
శ్రీలంక మాజీ సారథి దిముత్ కరుణరత్నే (2,160 రన్స్) మాత్రమే 2 వేలకు పైగా పరుగులు సాధించారు.