మంత్రి కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా సీరియస్ గా తీసుకొన్నట్లు సమాచారం. రేవంత్ రెడ్డి దిల్లీలో ఉన్నప్పుడే కొందరు ముఖ్యనాయకులతో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఉప ముఖ్యమంత్రితోనూ, మరికొందరు మంత్రులతోనూ మాట్లాడినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలిసింది. పీసీసీ క్రమశిక్షణా కమిటీ బుధవారం మంత్రి కొండా సురేఖకు నోటీసు ఇవ్వగా, కుమార్తె చేసిన ఆరోపణలకు తానెలా బాధ్యురాలినని గురువారం సమాచారం ఇచ్చారు.