కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ జీవిత చరిత్ర “బి లాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్” పుస్తకం ఈ రోజు విడుదలైంది. ఈ నేపథ్యంలో ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘అమ్మా.. నిన్ను నాన్నతో కలిసి 35 ఏళ్ల కిందట చూశాను. ఆయన మనల్ని వదిలిపెట్టి పోయినా ఎన్నడూ ధైర్యాన్ని కోల్పోలేదు, గౌరవాన్ని తగ్గించుకోలేదు. నాన్న మరణం తరువాత నీ జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డావో నాకు, ప్రియాంకకు మాత్రమే తెలుసు. నిన్ను చూసి గర్వపడుతున్నా’ అని తెలిపారు.