హైదరాబాద్ నగర వాసులకు ఇప్పుడు కొత్త సమస్య వేధిస్తుంది. లంగర్‌హౌస్ ప్రాంతంలో దోమలు భారీ సంఖ్యలో గుంపుగా చేరి సుడిగాలిలా పైకి ఎగురుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా దోమలు మన చుట్టూ తిరగటం సహజమే కానీ, ఇక్కడ మాత్రం వేలాది దోమలు ఒకేసారి వలయాకారంలో తిరుగుతూ భూమి నుంచి పైకి దూసుకెళ్తున్నట్లు సుడిగాలిలా కనిపించటం ఆందోళన కలిగిస్తుంది. నగరంలో మురుగు కాలువలు, నిలిచిపోయిన నీరు, చెత్త పేరుకుపోవడం వంటి కారణాలతో దోమల సంఖ్య పెరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.