రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని YSRCP శ్రేణులంతా ఐక్యంగా ముందుకు సాగాలని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజా మద్దతును దెబ్బతీసేందుకు అధికార యంత్రాంగాన్ని, పోలీసులను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని జగన్ హెచ్చరించారు. ఇలాంటి అడ్డంకులన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని పోరాడేందుకు శ్రేణులంతా సిద్ధం కావాలని ఆయన సూచించారు. ప్రజా ఆగ్రహాన్ని కప్పిపుచ్చేందుకు రకరకాల కుట్రలకు తెరలేపుతున్నారని ప్రజల దృష్టిని వేరే అంశాలపైకి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన మండిపడ్డారు.