అనేక కేసుల్లో నిందితుడిగా 2023 నుంచి రావల్పిండిలోని అడియాలా జైలులో ఉంటున్న ఇమ్రాన్ ఖాన్ తాజాగా భార్య బుష్రా బీబీ, సోదరితో భేటీ అయ్యారు. జైలు కాన్ఫరెన్స్ రూమ్‌లో ఇమ్రాన్ ఖాన్ వీరిని ప్రత్యేకంగా కలిసారు. ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ కథనం ప్రకారం సుదీర్ఘ కాలం తర్వాత జైలు పరిసరాల్లో భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు చూసుకోవడంతో భావోద్వేగానికి లోనయ్యారు. నోరీన్ నియాజీ తన సోదరుడు ఇమ్రాన్ ఖాన్‌తో 15 నిమిషాల భేటీలో అతని ఆరోగ్య పరిస్థితి గురించి చర్చించినట్లు తెలిసింది.