తమిళనాడులో విద్యార్థులు రాజకీయ నిరసనలలో పాల్గొనకూడదంటూ విధించిన వివాదాస్పద ఆంక్షలను ఉపసంహరిస్తూ ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు రాజకీయ ఆందోళనలకు దూరంగా ఉండాలంటూ జారీ చేసిన సర్క్యులర్‌ను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. కాక్రోచ్ జనతా పార్టీ తో పాటు లెఫ్ట్ పార్టీలు నిర్వహించే ఏ రాజకీయ నిరసనలలో విద్యార్థులు పాల్గొనకుండా నిరోధించాలంటూ గతంలో పంపిన విద్యాశాఖ ఆదేశాలను ఉపసంహరించుకున్నట్లువిద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ సింథియా సెల్వి స్పష్టం చేశారు.