తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాష్ట్రంలోని శాసనసభ్యులందరికీ నూతనంగా కార్లను సమకూర్చనున్నట్లు తెలిపారు. తమ తమ నియోజకవర్గాల్లో చురుగ్గా పర్యటించి, ప్రజల సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రతి ఎమ్మెల్యేకు కూడా ఒక్కో కారును సమకూర్చుతామని, దీనికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని విజయ్ వెల్లడించారు. వాటి నిర్వహణ, డ్రైవర్ వేతనం, ఇంధన వ్యయం, అవసరమైన ఇతరత్రా ఆర్థిక సాయాన్ని కూడా తామే చెల్లిస్తామని చెప్పారు. దీనికోసం ఒక్కో ఎమ్మెల్యేకు ప్రతి నెలా 75,000 రూపాయల చొప్పున నిధులు కేటాయిస్తామని అన్నారు.