కొండమల్లెపల్లిలోని నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ కె. రూపారెడ్డి హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ దారుణానికి పాల్పడింది అదే పాఠశాలలో చదివిన వంశీ, అనిల్ అనే విద్యార్థులే అని విచారణలో తేలినట్లు సమాచారం.డబ్బుల కోసం ఆశపడే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. హత్య అనంతరం నిందితులు గోవాకు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. విద్యార్థులు సుమారు రూ.4 లక్షల నగదు చోరీ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.