భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా వ్యక్తిగత జీవితం మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడాకుల తర్వాత, సానియా మీర్జా రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ నెట్టింట రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.ముఖ్యంగా ఆమె విదేశీయుడిని లేదా ఇతర రంగాలకు చెందిన ప్రముఖులను వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. షోయబ్ మాలిక్‌తో విడిపోయిన అనంతరం సానియా మీర్జా తన కుమారుడు ఇజాన్ మీర్జా మాలిక్‌తో కలిసి దుబాయ్ మరియు హైదరాబాద్‌లలో ఉంటున్నారు.