మలయాళ చిత్ర పరిశ్రమలో లెజెండరీ హీరో అయిన మోహన్ లాల్, తన 66 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం జోరు తగ్గించకుండా కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. తాజాగా ఆయన సినిమా రంగంలో ప్రకంపనలు సృష్టిస్తూ, ఏకంగా ఏడుగురు ప్రముఖ దర్శకులతో కొత్త ప్రాజెక్ట్‌లను ఒకేసారి ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ.. అత్యంత ప్రత్యేకమైన ఫిల్మ్‌మేకర్స్‌తో కలిసి ఎగ్జైటింగ్ స్టోరీలు, ఆసక్తికరమైన ప్రయాణాలకు సిద్ధమవుతున్నానని పేర్కొన్నారు.