13 నుండి 17 సంవత్సరాల వయస్సు గల యువతీయువకుల కోసం ప్రత్యేకంగా ChatGPT for Teens పేరిట ఈ ఫీచర్‌ను పరిచయం చేసింది. ప్రస్తుత కాలంలో డిజిటల్ టెక్నాలజీపై ఆధారపడటం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, టీనేజర్లు ఏఐ చాట్‌బాట్‌ను సురక్షితంగా, బాధ్యతాయుతంగా ఉపయోగించేలా పలు కఠిన భద్రతా నిబంధనలు, ప్రత్యేక ఫీచర్లను చేర్చారు. యూజర్లు తమ వయస్సును 13-17 సంవత్సరాల మధ్యగా నమోదు చేసినా లేదా సిస్టమ్ ద్వారా గుర్తించినా, వారి అకౌంట్లు ఆటోమేటిక్‌గా ఈ కొత్త టీన్ వెర్షన్‌లోకి మారిపోతాయి.