రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం తీవ్ర రూపం దాలుస్తోందని, దీనివల్ల భయంకరమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 2026 జూన్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో రాష్ట్రంలో మొత్తం 867 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా, కేవలం 557 మిల్లీమీటర్లు మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని, జులైలో 68 శాతం మేర లోటు వర్షపాతం నమోదైందని చెప్పారు. సెప్టెంబర్ లో 35%, అక్టోబర్లో 25%, నవంబర్లో 20% వర్షపాత లోటు కొనసాగవచ్చని పేర్కొన్నారు.