ఏపీలో కూటమి పాలనలో పరిస్థితులు దారుణంగా దిగజారాయని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డ ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి, మద్యం అక్రమ రవాణాను అరికట్టాల్సిన పోలీసుల వాహనంలోనే గంజాయి, మద్యం బాటిళ్లతో ప్రజలకు అడ్డంగా దొరికిపోవడంపై ‘ఎక్స్’ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అసలు రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు వ్యవస్థలోనే, అక్రమాలను అడ్డుకోవాల్సిన యంత్రాంగంతోనే అక్రమాలు చేయిస్తుంటే, వాటిలోనే అవినీతి చోటుచేసుకుంటే ప్రజలు ఎవరిని నమ్మాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలని ప్రశ్నించారు.