బీహార్‌లోని లఖీసరాయ్ జిల్లా అశోక్ ధామ్ (ఇంద్రదమనేశ్వర్ మహాదేవ్) ఆలయంలో సావన్ మాసం మూడో సోమవారం జలాభిషేకానికి భక్తులు గుంపులు గుంపులుగా తరలిరాగా తొక్కిసలాట జరిగింది. విద్యుత్ స్తంభం/తీగ పడి కరెంటు షాక్ కలిగినట్లు భయం వ్యాపించడంతో భక్తులు పరుగులు తీశారు. దీంతో ఏడుగురు మృతి చెందారని తెలుస్తోంది. కొంతమందికి గాయాలవ్వడంతో.. ఆస్పత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉంది. సుమారు 50 వేల మంది భక్తులు ఉన్నారని ప్రాథమిక అంచనా.