తమ సైన్యానికి చెందిన ముగ్గురు పైలట్లను ఖతార్ బంధించిందని, వారిని వెంటనే విడిచిపెట్టాలని ఇరాన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఖతార్ ప్రభుత్వానికి సూచించింది. అయితే, ఇరాన్ ఆరోపణలను ఖతార్ ఖండించింది. తాము పైలట్లను బంధించలేదని, ఈ ప్రచారంలో నిజం లేదని పేర్కొంటూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. గత ఏప్రిల్లో విమానాల్ని కూల్చిన ఘటనలో ముగ్గురు పైలట్లు, విమానాల నుంచి దూకి తమనుతామ రక్షించుకున్నారని ఇరాన్ చెబుతోంది.అయితే, ఖతార్ భూభాగంలో దిగిన ముగ్గురు పైలట్లను ఆ దేశం బంధించిందని ఇప్పుడు ఇరాన్ ఆరోపిస్తోంది.