విద్యార్థుల నిరసనలు, ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియపై యోగా గురువు రామ్‌దేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా పెరుగుతోన్న నిరసనలు, గందరగోళం లాంటివి విద్య, ఉపాధి వ్యవస్థల్లో ఉన్న తీవ్రమైన లోపాలను సూచిస్తున్నాయని అన్నారు. ఇంటర్వ్యూల సమయంలోనే 90 శాతం అవినీతి జరుగుతోందని వ్యాఖ్యానించారు. కులం, మతం, భావజాలం వంటి వాటి ఆధారంగా ఇంటర్వ్యూయర్స్ కొందరికి అనుకూలంగా వ్యవహరిస్తుండటంతో.. అర్హులైన అభ్యర్థులు నష్టపోతున్నారని చెప్పారు. పాఠశాలలు, కళాశాలల్లో ఇప్పటికీ కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు వీధుల్లోకి వస్తున్నారని బాబా రాందేవ్ అన్నారు.