ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడం కోసం ఒక తరం తీవ్రంగా పోరాడితే, ఆ స్వాతంత్ర్యాన్ని, దేశ సమగ్రతను కాపాడటానికి మరొక తరం కృషి చేసింది అని బలమైన, సమర్థవంతమైన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారతదేశం వేగంగా అడుగులు వేస్తోందని ఆయన గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించిన ‘వికసిత్ భారత్’ సంకల్పంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా తనదైన కీలక పాత్రను పోషిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.