కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ప్రారంభించి ఏడాది పూర్తి కావటంతో సీఎం చంద్రబాబు నేరుగా మహిళలతో ఈ పథకంపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా సమస్యలు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేసారు.స్త్రీ శక్తి పథకం అమలు తీరు తెన్నుల గురించి మహిళలను అడిగి తెలుసుకు న్నారు. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో వివిధ వర్గాల మహిళలు 87 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని వెల్లడించారు. రోజుకు 24 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారన్నారు.