టీమిండియా శ్రీలంకలో పర్యటిస్తోంది. గాలె వేదికగా తొలి టెస్టు నేడు ప్రారంభమైంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మ్యాచ్కు ముందు తాము బస చేసిన హోటల్ వద్ద భారత జట్టు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసింది. ఈ కార్యక్రమంలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్ర్మన్ గిల్ ఇతర ఆటగాళ్లు పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధులకు గంభీర్ నివాళులు అర్పించారు. స్వాంతంత్ర్య దినోత్సవం రోజున దేశం తరపున ఆడుతున్న జట్టుకు నాయకత్వం వహించడం గర్వంగా ఉందని శుభ్మన్ గిల్ సంతోషం వ్యక్తం చేశారు.