రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పొటో పెట్టడంపై బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆ కార్డులపై ప్రధాని నరేంద్ర మోడీ పొటో పెట్టకుండా మీ పొటో ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు.బిఆర్ఎస్ హయాంలోనైనా ఇప్పుడైనా కేంద్రమే బియ్యం ఇస్తున్నదని, తాము అడుక్కోవడం లేదని, ప్రొటోకాల్ గురించి చెబుతున్నామని ఆయన తెలిపారు. అయినా ప్రధాని పొటో పెట్టకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు.