కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన నేషనల్ డెమొక్రటిక్ అలైన్స్ ప్రభుత్వం మిత్రపక్షాల మధ్య ఎటువంటి మనస్పర్థలు లేకుండా నడిపించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా గతంలో ఎన్డీఏ ఉన్న కన్వీనర్ వ్యవస్థను పునరుద్ధరించాలని బీజేపీ భావిస్తోంది. ఈ ప్రతిపాదనకు ప్రధాని నరేంద్ర మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అత్యున్నత బాధ్యతాయుతమైన పదవికి ఇద్దరు సీనియర్ నాయకుల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇందులో మొదటి పేరు చంద్రబాబు నాయుడు. రెండో పేరు నితీష్ కుమార్, ఉత్తర భారత్ రాజకీయాల్లో నితీష్ మాస్టర్ మైండ్.