మధ్యప్రదేశ్లోని పలు గ్రామాల పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. అంతుపట్టని వ్యాధుల కారణంగా ఇప్పటి వరకు 8 మంది పిల్లలు మరణించారు. దీంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మచ్ఛుర్దా, అడోరి, బొండరి, కోర్కా, కుండెకాస గ్రామాల పిల్లలు గత 40 రోజులుగా తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు. మలేరియా, టైఫాయిడ్, ఫంగల్, చర్మ వ్యాధులు, గజ్జి, తట్టు, జ్వరం, జలుబు, దగ్గు, డీహైడ్రేషన్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు.