వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలులో పర్యటించారు. జైలులో ఉన్న తన పార్టీ ఎమ్మెల్యేను పరామర్శించారు. జైలులో తనను కూడా అవమానించేలా ఆదేశాలు ఇచ్చారని మండిపడ్డారు. కేవలం రాజకీయ కక్షతోనే వందల మంది పోలీసులను ఆయన ఇంటిపైకి పంపించారని కిటికీలు, తలుపులు పగలగొట్టి మరీ అరెస్టు చేశారని ఆరోపించారు. ముఖ్యంగా బీసీ నాయకులను టార్గెట్ చేస్తున్నారని, సీదిరి అప్పలరాజు, ముస్తాఫా, కారుమారి సునీల్ వంటి నేతపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఇది చంద్రబాబు శాడిస్ట్ మెంటాలిటీకి నిదర్శనమని జగన్ మండిపడ్డారు.