యాదాద్రి భువనగిరిలో విషాదం చోటు చేసుకుంది. పాఠశాల ఆవరణలో ఆడుకుంటుండగా ఒక్కసారిగా చెట్టు కూలడంతో ఒక విద్యార్థిని మృతి చెందగా ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే భువనగిరి పట్టణం లోని బాగాయత్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న భువనగిరి పట్టణానికి చెందిన 3వ తరగతి విద్యార్థిని అలీనా (8) స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా క్రీడలు ఆడుతున్న క్రమంలో అకస్మాత్తుగా చెట్టు విరిగి మీద పడడంతో విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. ఇదే ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి.