ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ పైలట్లందరికీ డోప్ టెస్ట్‌ను తప్పనిసరి చేసింది. ఇటీవల ఫుకెట్- దిల్లీ విమాన ఘటనలో పైలట్-ఇన్-కమాండ్ గంజాయి సేవించినట్లు డ్రగ్ టెస్టులో తేలిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. డీజీసీఏ సూచించిన ర్యాండమ్ తనిఖీలు కాకుండా.. గురుగ్రామ్ అకాడమీలో శిక్షణ సమయంలో, విమాన ప్రయాణం ముగిసిన తర్వాత ఎయిర్ ఇండియా ఫ్లైట్ బ్రీఫింగ్ సెంటర్లు, కార్యాలయాల్లో పైలట్లకు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రయాణికుల భద్రత, పారదర్శకత, ఎయిరిండియా పాటిస్తున్న అత్యున్నత ప్రమాణాలను కాపాడేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు విమానయాన సంస్థ తెలిపింది.