సీనియర్ నేత, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మార్పుపై మరోసారి స్పందించారు. గురువారం కామారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తాను డబ్బుకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చినట్లు పునరుద్ఘాటించారు. తాను ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదన్నారు. తనకు స్వార్థం ఉందని కొందరు బుద్ధిహీనులు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలు వదులుకుంటానని పోచారం సవాల్ విసిరారు.