చమురు ఎగుమతులకు కేరాఫ్ అడ్రస్గా ఉండే రష్యా.. ఇప్పుడు ఇంధనం కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్ వరుస డ్రోన్ దాడులతో రష్యాలోని రిఫైనరీలు తీవ్రంగా దెబ్బతినగా పెట్రోల్, డీజిల్ కు భారీ కొరత ఏర్పడింది. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు పుతిన్ సర్కార్ కనీవినీ ఎరుగని నిర్ణయం తీసుకుంది. రష్యా చరిత్రలోనే తొలిసారిగా భారత్ నుంచి పెట్రోల్ దిగుమతి చేసుకుంటోంది.