కొండమల్లేపల్లి మండల కేంద్రంలో కొండమల్లేపల్లిలో నాగార్జున గ్రామర్ స్కూల్ ప్రిన్సిపాల్ కల్లు రూపారెడ్డి(52) దారుణ హత్యకు గురైంది. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండడం చూసి దుండగులు హత్యచేశారు. కొండమల్లేపల్లి సీఐతో పాటు ఇద్దరు ఎస్ఐలు నివాసం ఉండే సమీప ప్రాంతంలోనే హత్య జరగడం కలకలం రేపింది.ఆమె భర్త రాజేందర్రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటారు. దుండగులు ఇంటి వెనకవైపు నుంచి వచ్చినట్టు తెలుస్తోంది. దీనికి తోడు హత్య జరిగిన ఇంట్లో ఎలాంటి చోరీ జరగకపోవడంతో దొంగలు కాదని భావిస్తున్నారు.