ఏనుగులు పర్యావరణ సమతుల్యతకు వారధిగా నిలుస్తాయని.. దేశ వన్యప్రాణి వారసత్వానికి అవి చిహ్నాలు అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. విశాఖలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో కేంద్ర అటవీ శాఖ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తో కలిసి పాల్గొన్నారు. ఏనుగుల సంరక్షణకు ఏపీ అత్యధిక ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. కుంకీ ఏనుగుల రాకతో రాష్ట్రంలో అద్భుత ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలోనూ ఏటా రెండు కుంకీ ఏనుగులకు శిక్షణ ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు.