ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సీఎం నారా చంద్రబాబు చేతుల మీదుగా గురువారం పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు జరగనున్నాయి. అయితే ఇలాంటి కీలకమైన ప్రారంభోత్సవాలకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎంను మంత్రి నారాయణ, బుధవారం రోజు కలిశారు. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. అయితే విశాఖలో ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ స్థాయి వేడుకకు హాజరుకావాల్సి ఉందని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు డిప్యూటీ సీఎంవో వెల్లడించింది.