అమిత్ షా ప్రతిపాదనపై రాహుల్ గాంధీ స్పందిస్తూ ఆయనతో చర్చించడానికి మాకేం భయం లేదని అన్నారు. ఆయన చెప్పే ఉపన్యాసాలు వినడానికి ప్రతిపక్షానికి ఆసక్తి లేదని, విద్యార్థులపై కాల్పులు ఎవరు జరిపారు. మేకులు ఉన్న లాఠీలతో ఎవరు కొట్టించారు అని రాహుల్ ప్రశ్నించారు. వీటిపై సమాధానాలు చెప్పేందుకు 20 రోజులుగా అమిత్ షా కనిపించకుండా పోయారని, సమాధానం చెప్పే ధైర్యం లేక సభకు రావడం లేదని అన్నారు. ఏ విషయంలోనూ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.