విదేశీ నిధుల నియంత్రణ చట్టం సవరణ (FCRA) బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)కి పంపాలని లోక్ సభ తీర్మానం చేసింది. ఈ మేరకు బిల్లుపై 31 మంది సభ్యులతో జేపీసీని కేంద్రం ఏర్పాటు చేసింది. జేపీసీలో 21 మంది లోక్ సభ, 10 మంది రాజ్యసభ ఎంపీలు ఉంటారు. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల వరకు గడువు విధించింది. విదేశీ నిధుల దుర్వినియోగాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం ఈ బిల్లు తీసుకొచ్చింది. అయితే ఈ బిల్లును ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.