ఏపీలో జూనియర్ డాక్టర్ నిరసన రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ప్రభుత్వ నిబంధనలు, జీవో ప్రకారం తమ స్టైఫండ్‌ను 30 శాతం వరకు పెంచాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరసన రెండో రోజుకు చేరుకుంది. ఇదిలా ఉండగా మంగళవారం హెల్త్ సెక్రటరీతో జూడాల ప్రతినిధులు జరిపిన చర్చలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. పొరుగున ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్న రీతిలోనే తమకు కూడా గౌరవప్రదమైన స్టైఫండ్ అందించాలని జూనియర్ డాక్టర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.