రెండేళ్ల క్రితం మలయాళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అఖిల్ మేఘా అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. భర్తకు తెలియకుండా స్థానిక బస్సు కండక్టర్ తో మేఘా ప్రేమలో పడింది. ఇకవారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరని.. భర్తను వదిలేసి కండక్టర్ తో కలిసి రాత్రికి రాత్రే వెళ్లిపోయింది. తొలుత మిస్సింగ్ అని భావించిన అఖిల్.. సీసీటీవీ కెమెరాలో తన ఇంటిముందు నుంచి లగేజీ బ్యాగులతో తన భార్య, కండక్టర్ వెళ్లడాన్ని చూసి తనకు జరిగిన అవమానాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.