ప్రపంచంలోనే అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఒకటైన టెక్ దిగ్గజం.. మలివిడత లేఆఫ్స్ పై దృష్టి సారించింది. సెప్టెంటర్ మొదటి లేదా రెండో వారంలో మరో విడతలో భారీగా టెక్కీలను తొలగించే అవకాశాలను పరిశీలిస్తోంది. ఒరాకిల్.. మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా లేఆఫ్స్ లిస్టును కూడా ప్రిపేపర్ చేయాలంటూ వివిధ విభాగాల మేనేజర్లను యాజమాన్యం ఆదేశించినట్లు సమాచారం. సెప్టెంబర్ 1 కంటే ముందే ఈ లేఆఫ్స్ ప్రక్రియ పూర్తి కావచ్చని ఈ కథనం పేర్కొంది.