సర్ లో తన ఓటును తొలిగించారన్న ప్రకాష్ రాజ్ ఓటును శాశ్వతంగా మారిన చిరునామా జాబితా చేర్చినట్టు ఈసీ తెలిపింది. అంతేకాదు ఆయన ఓటును తెలిగించలేదని బెంగళూరు సిటీ కార్పోరేషన్ పేర్కొంది.ఈ విషయమై ప్రకాష్ రాజ్‌తో ఫోన్లో మా వాళ్లు సంప్రదించారు. ఆయన కూడా ఆ అపార్ట్మెంట్లో ఉండటం లేదని అదే ఏరియాలో వేరే అపార్ట్మెంట్లో నివసిస్తున్నట్టు ప్రకాష్ రాజే స్వయంగా తెలిపారని సదరు ఎన్నికల అధికారి తెలిపారు. ఫారం 6తో ఓటరు జాబితాలో తన పేరును మళ్లీ నమోదు చేసుకోవచ్చని తెలిపింది.