విద్యార్దులపై ఢిల్లీ పోలీసులు చేసిన బలప్రయోగంపై ఇప్పటివరకూ పార్లమెంట్ లో ప్రకటన చేయకుండా తప్పించుకుంటున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఎట్టకేలకు విపక్షాల ఒత్తిడికి తలొగ్గారు. రెండు రోజుల క్రితమే పార్లమెంట్ కు వచ్చేందుకు అంగీకరించిన ఆయన.. ఆ తర్వాత విపక్షాలు జార్ఖండ్, పంజాబ్ విద్యార్ధుల ఆందోళనలపైనా చర్చించాలని షరతులు పెట్టారు. వారి ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుండి రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు సభలోనే అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు.