మేడ్చల్ జిల్లా షామీర్ పేట్ మండలంలోని దేవరాయాంజాల్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.కోల్డ్ రష్ లాజిస్టిక్స్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. గమనించిన గోదాం నిర్వాహకులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. గత రెండు గంటలుగా మంటలు ఎగసిపడుతుండడంతో పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
ఈ ప్రమాద ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

