మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ భుజానికి డాక్టర్స్ విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు. జులై 27న షూటింగ్ టైంలో భుజానికి గాయం కాగా వైద్యుల సూచన మేరకు ఆయన సర్జరీ చేయించుకున్నారు. హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ జె.మధూసూదన్ రావు, డాక్టర్ ఆర్ఏ పురంచంద్ర తేజస్వి నేతృత్వంలో వైద్యుల బృందం బుధవారం ఆయనకు సక్సెస్ ఫుల్‌గా సర్జరీ కంప్లీట్ చేసింది. ప్రస్తుతం ఎన్టీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని… ఆయనకు 6 నుంచి 8 వారాల రెస్ట్ అవసరమని వైద్యులు సూచించారు.