రూ. 10, రూ. 20 విలువ కలిగిన ప్లాస్టిక్ నోట్లను ఈ రెండు రకాల విలువ కలిగిన ఒక్కో రకంలో 100 కోట్ల నోట్లను మార్కెట్లోకి విడుదల చేయడానికి కేంద్రం అనుమతించినట్లు రాజ్యసభలో ఆర్థిక శాఖ రాతపూర్వక సమాధానం ద్వారా వెల్లడించింది. కొత్త ప్లాస్టిక్ నోట్లు వచ్చినంత మాత్రాన పాత కాగితపు నోట్లు రద్దు కావు అని ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండూ మార్కెట్లో సమాంతరంగా చెల్లుబాటు అవుతాయి. కేవలం నోట్ల ఆయుష్షు పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు.