అంతర్జాతీయ యువజన దినోత్సవమును ప్రతి సంవత్సరం ఆగస్టు 12 న జరుపుకుంటారు. ఐక్యరాజ్యసమితి యువత కోసం చేపట్టిన ప్రపంచ కార్యాచరణ కార్యక్రమం పట్ల యువతకు అవగాహన కలిగించేందుకు అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ప్రకటించింది. మొదటి అంతర్జాతీయ యువజన దినోత్సవం 2000 ఆగస్టు 12 లో జరిగింది.