జూనియర్ ఎన్టీఆర్ మేజర్ సర్జరీకి రెడీ అవుతున్నారు. ఇటీవల ఓ సినిమా షూటింగ్ లో ఆయన గాయపడిన సంగతి తెలిసిందే. భుజానికి గాయం కారణంగా కొన్ని రోజులుగా ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో వైద్యుల సలహా మేరకు శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్నారు తారక్. బుధవారం (ఆగస్టు 12) హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో ఎన్టీఆర్ కు సర్జరీ జరగనుందని ఆయన టీమ్ తెలిపింది. సర్జరీ తర్వాత ఎప్పటికప్పడు తారక్ హెల్త్ అప్డేట్ ఇస్తామంటూ టీమ్ వెల్లడించింది.