రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కాంక్షిస్తూ నాగార్జునసాగర్‌లో ప్రభుత్వం వరుణ యాగం చేపట్టింది. సాగర్ తీరంలోని విజయ విహార్ ప్రాంగణంలో తెల్లవారుజామున 4 గంటలకు ప్రారంభమైన యాగం ప్రారంభమైంది. ఈ మహా క్రతువుకు సంబంధించిన పూర్ణాహుతి కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేద పండితులు నిర్ణయించిన ముహూర్తం మేరకు నాగార్జునసాగర్‌లోని విజయ్ విహార్ ప్రాంగణంలో 11 హోమ గుండాలతో 108 మంది రుత్వికులు ప్రత్యేక వైదిక క్రతువు నిర్వహిస్తున్నారు.